Hyderabad,telangana, ఏప్రిల్ 15 -- ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి విడతలో ఖరారైన వారిలో పలువురు ఇంటి నిర్మాణాలు కూడా చేపట్టారు. ఇక రెండో విడత లబ్ధిదారుల గుర్తింపుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నెలాఖారులోపు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది.

ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. గ్రామ స్థాయిలో ఇందిర‌మ్మ ఇండ్ల క‌మిటీలు ఆమోదం పొందిన జాబితాను మండ‌ల స్థాయి క‌మిటీలు ప‌రిశీలించాల‌ని సూచించారు. ఆ క‌మిటీల ప‌రిశీల‌న అనంత‌రం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి పంపాల‌ని.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదించాకే ...