భారతదేశం, ఏప్రిల్ 5 -- తెలంగాణలో గృహ నిర్మాణ శాఖ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం అమలుకు కూడా సరిపడా సిబ్బంది లేరు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్‌ ఇంజనీర్లకు అప్పగించబోతోంది. మొదట 390 మందిని ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించుకునేందుకు మ్యాన్‌పవర్‌ సప్లయర్స్‌కు బాధ్యతను అప్పగించింది.

దీనికి సంబంధించిన ఇప్పటికే నోటిఫికేషన్‌ కూడా జారీ అయ్యింది. ఈనెల 11 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందులో ఎంపికైనవారు అసిస్టెంట్‌ ఇంజనీర్‌ హోదాలో పనిచేయాల్సి ఉంటుంది. తొలుత ఒక సంవత్సరం కోసం వీరితో గృహనిర్మాణ శాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది. మరో రెండుమూడు వారాల్లో ఈ ప్రైవేట్‌ ఇంజనీర్లు విధుల్లోకి వచ్చే అవకాశం ఉంది. వీరికి నెలకు రూ.33,800 చొప్పున చెల్లించనున్నట్టు సమాచారం.

ఉమ్మడి రాష్ట్రం...