భారతదేశం, ఫిబ్రవరి 10 -- ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతానికి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను అధికారులు తయారు చేశారు. ఈ జాబితా ఆధారంగా ఇళ్ల గ్రౌండింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. మొదట ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రీ గ్రౌండింగ్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. గ్రామాలకు వెళ్లనున్న అధికారులు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటిని ఎలా నిర్మించుకోవాలి.. నిర్మాణ సామాగ్రి సరఫరా, ఇతర సందేహాలను నివృత్తి చేయనున్నారు.

సర్వే సమయంలో చూపిన సొంత స్థలంలోనే లబ్ధిదారుడు ముగ్గు పోసుకోవాల్సి ఉంటుంది. మరోచోట కట్టుకుంటామంటే రద్దు చేస్తారు.

ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శికి, వార్డు ఆఫీసర్‌కు సమాచారం ఇవ్వాలి. క్షేత్రస్థాయికి వారు వచ్చి ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. న...