తెలంగాణ,హైదరాబాద్, జనవరి 17 -- మొద‌టి విడ‌త‌లో ఇండ్ల స్ధ‌లం ఉన్న‌వారికే ఇందిరమ్మ ఇండ్లు అందుతాయని రాష్ట్ర గృహా నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇవాళ సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆరా తీశారు.

అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి ఇందిర‌మ్మ ఇండ్లు అందిస్తామని పొంగులేటి చెప్పారు. పార‌దర్శ‌కంగా గ్రామ‌సభ‌ల్లో ఇందిర‌మ్మ ల‌బ్దిదారుల జాబితాలను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. రెండ‌వ విడ‌త‌లో ఇంటి స్ధ‌లంతో పాటు ఇందిర‌మ్మ ఇల్లును నిర్మించి ఇవ్వడం జరుగుతుందని ఉద్ఘాటించారు.

సమీక్ష సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల‌కు అర్హులైన ల‌బ్దిదారుల‌కు సంబంధించిన నివాస స్ధ‌లం ఉన్న‌వారి జాబితా, నివాస స్ధ‌లం లేని వారి జాబితా రెండు జాబితాల‌ను గ్రామ‌సభ‌ల్లో పెట్టాల‌ని అధికారుల‌కు సూ...