భారతదేశం, మార్చి 28 -- పైల‌ట్ గ్రామాల‌లో ఇందిర‌మ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని, బేస్‌మెంట్ పూర్త‌యిన ఇండ్ల‌కు త‌క్ష‌ణం చెల్లింపులు జ‌ర‌పాల‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. స‌చివాల‌యంలో శుక్ర‌వారం వ‌రంగ‌ల్ స్మార్ట్ సిటీ ప‌నులు, సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌, తాగునీరు, ఇందిర‌మ్మ ఇండ్లు త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. 'ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం ఈ ప్ర‌భుత్వానికి అత్యంత ప్రాధాన్య‌తా అంశ‌ం. దీనిని దృష్టిలో పెట్టుకొని క‌లెక్ట‌ర్లు ప‌నిచేయాలి. ఇందిరమ్మ ఇండ్ల ల‌బ్దిదారుల‌కు ప్ర‌భుత్వం నాలుగు విడ‌త‌ల‌లో చెల్లింపులు చేస్తుంది. మొద‌టి విడ‌త‌లో బేస్ మెంట్ లెవెల్ పూర్త‌యిన ఇండ్ల‌కు ల‌క్ష రూపాయిలు ఇస్తుంది. ఇండ్ల వివ‌రాల‌ను హౌసింగ్ విభాగానికి పంపిస్తే ...