తెలంగాణ,హైదరాబాద్, జనవరి 2 -- రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. ఈ సంక్రాంతిలోపే పూర్తిస్థాయిలో సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది. గ్రామాల్లో సొంత స్థలాలు ఉన్న వారు అత్యధికంగానే ఉంటున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అంతేకాదు.. ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది.

మరోవైపు తొలి విడతలో సొంత స్థలం ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దశలో స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం తరపున సాయం అందిస్తామని చెప్పింది. ఈ క్రమంలో.. ఈ విడతలో ఖాళీ జాగా ఉన్న వారికే అత్యధికంగా స్కీమ్ కు అర్హత సాధించే అవకాశం కనిపిస్తోంది.

ఇందిర్మ ఇళ్ల స్కీమ్ విషయంలో గ్రేటర్ హైదరాబాద్ లో చూస్తే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ స్కీమ్ కో...