భారతదేశం, మార్చి 15 -- ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరో కొత్త విషయం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత ఇళ్ల కోసం సుమారు 30 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసింది. 23 లక్షల దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించింది. ఆ జాబితా సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సర్వేను తాము పరిగణనలోకి తీసుకోబోమని కేంద్రం మెలిక పెట్టింది.

తాము రూపొందించిన మొబైల్‌ అప్లికేషన్‌ ఆధారంగా మళ్లీ సర్వే చేసి వివరాలు ఇవ్వాలని.. కేంద్రం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం డైలమాలో పడింది. మళ్లీ అన్ని లక్షల దరఖాస్తులకు సంబంధించి కేంద్ర యాప్‌తో సర్వే చేయటం ఇప్పటికిప్పుడు అయ్యే పనికాదు. దీంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. ఏం చేయాలన్న దానిపై చర్చలు జరుపుతున్నారు.

ఇప్పటికే రేవంత్ ప్రభుత్వ...