భారతదేశం, ఏప్రిల్ 7 -- రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొదటి విడతలో భాగంగా జనవరి 26న 71 వేల మందికి ప్రభుత్వం ఇండ్ల మంజూరు పత్రాలు ఇచ్చింది. రీ వెరిఫికేషన్ లో 6 వేల మందిని అధికారులు అనర్హులుగా తేల్చి తొలగించారు. చివరికి 65 వేల మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో ఇప్పటి వరకు దాదాపు 12 వేల మంది ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు.

ఉగాది పండగ అయిపోవం, మంచి ముహుర్తాలు ఉండటం, వ్యవసాయ పనులు చివరి దశకు చేరుకోవడంతో.. ఇండ్ల నిర్మాణ పనులు ఊపందుకుంటాయని అధికారులు చెప్తున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 4 దశల్లో రూ.5 లక్షలు లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుంది. తొలి దశలో బేస్ మెంట్ కంప్లీట్ అయ్యాక లక్ష రూపాయలు ఇవ్వాలి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,200 మంది బేస్​మెంట్ పనులు...