భారతదేశం, ఫిబ్రవరి 17 -- తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకంలో లబ్ధిదారులకు వీలైనంత ఎక్కువ మేలు జరిగేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇసుక, సిమెంట్, స్టీల్ వంటి సామాగ్రిని తక్కువ ధరకు ఇప్పించేలా చర్యలు తీసుకుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా లబ్ధిదారులకు మరింత మేలు జరగనుంది.

ఇందిరమ్మ ఇళ్లు కట్టడానికి మేస్త్రీలకు ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ మాదాపూర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్)లో శిక్షణ ఇప్పిస్తోంది. మొదటి దశలో 250 మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌కు ఆరు రోజుల పాటు.. మొత్తం వెయ్యి మందికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం నుంచే శిక్షణ ప్రారంభమైంది.

ఇక్కడ శిక్షణ తీసుకున్న మేస్త్రీలను గ్రామాలకు పంపనున్నారు....