తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 15 -- తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పట్టాలెక్కింది. రాష్ట్రంలో మండలానికి ఒక్క గ్రామం చొప్పున మొత్తం 562 పంచాయతీల్లో 71,482 మంది లబ్ధిదారులు మొదటి విడతలో ఎంపికయ్యారు. వీరందరికీ ప్రోసిడింగ్స్ కాపీలు అందిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లోనూ లబ్ధిదారుల గుర్తింపు కోసం కసరత్తు జరుగుతోంది.

ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం మూడు కేటగిరిలుగా విభజించింది. సొంత జాగా ఉండి ఇళ్లు లేనివాళ్లను ఎల్ 1 కేటగిరిలో ఉంచగా. ఇక సొంత స్థలం లేనివారని ఎల్‌-2, సొంత ఇల్లు ఉండీ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్‌-3లో చేర్చారు. అయితే ఈ వివరాలను తెలుసుకునేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ వెబ్ సైట్ లోకి వెళ్లి వారి అప్...