తెలంగాణ,కరీంనగర్, మార్చి 8 -- కోటి మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి మిషన్-2025 పేరుతో కొత్త పాలసీ తీసుకొచ్చింది. అందులో భాగంగా మహిళా సంఘాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు రానున్నాయి.

ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు సెర్ఫ్ ఆధ్వర్యంలో, పట్టణాల్లో మెప్మా పరిధిలో మహిళా సంఘాలు కార్యకలాపాలు చేపడుతున్నాయి. వీటన్నింటిని ఒకే వేదికపైకి తీసుకురావాలని ఇటీవలే మంత్రివర్గం నిర్ణయించింది. వీటి బాధ్యతలను నగరం, పట్టణాల్లో మెప్మా, గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏలోని సెర్ఫ్ చూస్తున్నాయి. రెండు శాఖలను విలీనం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించగా. ఇక మీదట ఇందిరా మహిళా శక్తి మిషన్ పేరుతో రెండు శాఖల అధికారులు, ఉద్యోగులు పని చేసే అవకాశముంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూ లన సంస్థ(మెప్...