భారతదేశం, మార్చి 17 -- TG Hostel Welfare Results : తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదలయ్యాయి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తాత్కాలిక సెలక్షన్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపిక జాబితా వివరాలు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

2022లో విడుదలై చేసిన నోటిఫికేషన్ లో మొత్తం 581 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో 574 మందితో సెలక్షన్ జాబితాను ప్రకటించారు. 24/06/2024 నుంచి 29/06/2024 వరకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించారు. కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షకు ఆన్‌లైన్‌లో మొత్తం 1,45,359 మంది దరఖాస్తు చేసుకున్నారు.

వివిధ సంక్షేమ శాఖలలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులకు 581 ఖాళీలకు 24/06/2024 నుంచి 29/06/2024 వరకు జరిగిన కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్...