భారతదేశం, మార్చి 1 -- TG High Court On Theatre Shows : తెలంగాణలోని థియేటర్లలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్, స్పెషల్ షోలపై హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇకపై థియేటర్లలో స్పెషల్ షోల నిర్వహణకు అనుమతిలేదని స్పష్టం చేసింది. అయితే మల్టీప్లెక్స్‌లకు ఊరట కల్పిస్తూ తాజాగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 16 సంవత్సరాలలోపు పిల్లలను అన్ని షోలకు అనుమతించాలని ఆదేశించింది. ఈ మేరకు జనవరి 21న జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. దీనిపై తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.

సినిమా థియేటర్లలో షోలు ప్రదర్శించడంలో సినిమాటోగ్రఫీ చట్టాన్ని కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం అర్ధరాత్రి 1:30 గంటల నుంచి ఉదయం 8:40 వరకు థియేటర్లలో ఎలాంటి ప్రత్యేక షోలు నిర్వహించరాదని...