భారతదేశం, ఫిబ్రవరి 5 -- TG High Court Judges : తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అడిషనల్‌ జడ్జీలుగా కొనసాగుతున్న వారిని పూర్తి స్థాయి జడ్జీలుగా నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ జరిగిన సుప్రీం కోర్టు కొలీజియం సమావేశంలో తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు శాశ్వత న్యాయమూర్తుల నియామకం ప్రతిపాదనను ఆమోదం లభించింది.

1. జస్టిస్ లక్ష్మీ నారాయణ అలిశెట్టి

2. జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి

3. జస్టిస్ సుజనా కళాసికం

తెలంగాణలోని జిల్లా కోర్టులకు జడ్జీలను హైకోర్టు నియమించింది. రాష్ట్రంలోని మొత్తం 30 జిల్లాలకు జిల్లా జడ్జీలను నియమిస్తూ హైకోర్టు నుంచి ప్రకటన వెలువడింది. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేలా పలు జిల్లాలకు జడ్జిలను నియమించారు.

Published by HT D...