తెలంగాణ,హైదరాబాద్, మార్చి 13 -- రాష్ట్రంలో ఒంటిపూట బడులపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఏప్రిల్ 23వ తేదీ వరకు హాఫ్ డే స్కూల్స్ ఉంటాయని వివరించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది.

ఒంటిపూడ బడుల నేపథ్యంలో ఉదయం 8 గంటలకే స్కూళ్లు తెరుచుకుంటాయి. మధ్యాహ్నం 12. 30 గంటలకు వరకు పని చేస్తాయి. పదో తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లల్లో మధ్యాహ్నం 1. 00 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు తరగతులను నిర్వహిస్తారు. ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లలకు వేసవి సెలవులు రానున్నాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....