భారతదేశం, మార్చి 6 -- తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు స్కూళ్లలో ఈ టైమింగ్స్ కొనసాగుతాయి. టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లల్లో మాత్రం.. మధ్యాహ్నం పూట తరగతులు నిర్వహించనున్నారు.

ఎండల తీవ్రత పెరుగుతున్నందున వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మార్చినెలలో తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో మార్చి 15వ తేదీన కంటే ముందే ఒక్కపూట బడులు నిర్వహించాలనే చర్చ జరిగింది. తాజాగా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంది. అటు ఆంధ్రప్రదేశ్‌‌లో కూడా మార్చి 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులను నిర్వ‌హించ‌నున్నారు.

మార్చిలో మొత్తం 8 రోజులు సెలవులు వచ్చాయ...