తెలంగాణ,హైదరాబాద్, మార్చి 29 -- ప్రవేశాల కోసం కామన్ అడ్మిషన్(TS Gurukul CET) టెస్ట్ ద్వారా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహించారు. ఇవాళ ఇందుకు సంబంధించిన ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి తెలిపారు.

ఈ ఎంట్రెన్స్ ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు సాధారణ గురుకులాల్లో (TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS, TGREIS) 5వ తరగతి అడ్మిషన్లు కల్పిస్తారు. 2025-26 విద్యాసంవత్సరానికి గాను ఉమ్మడి పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 50 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థి సాధించిన ర్యాంక్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

ఇంగ్లీష్ మీడియం బోధనతో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలల్లో సీట్లకు తెగ డిమాండ్ ఉంది. గతేడాది కూడా భారీ స్థాయిల...