భారతదేశం, ఫిబ్రవరి 7 -- TG Group1 Results: తెలంగాణలో గ్రూప్‌1 ఫలితాలు మరో వారం పదిరోజుల్లో విడుదల కానున్నాయి. గ్రూప్‌1 తో పాటు ప్రాధాన్యత క్రమంలో గ్రూప్‌ 2, గ్రూప్3 నియామకాలను ఏప్రిల్‌లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాలను ప్రాధాన్యత క్రమంలో భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ క్రమంలో తెలంగాణలో563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షల ఫలితాలను ఫిబ్రవరిలో విడుదల చేయాలని కమిషన్‌ భావిస్తోంది. గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే ముగి సింది. గ్రూప్‌ 1 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సాధించిన మార్కులను బట్టి 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తుది పరిశీలన చేస్తోంది.

ఫిబ్రవరిలోనే మెయిన్స్‌ ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మరో...