భారతదేశం, మార్చి 31 -- TG Group1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి చేపట్టిన గ్రూప్‌ 1 రిక్రూట్‌మెంట్‌ జనరల్ ర్యాంకింగ్ జాబితాను ఉగాది పండుగ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. గ్రూప్-1 ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అర్హత పరీక్షల్లో మహిళ అభ్యర్థులు అగ్రస్థానంలో ఉన్నారు. మల్టీజోన్-1, మల్టీజోన్-2 రెండు చోట్లా టాప్ ర్యాంకులను మహిళా అభ్యర్థులే సాధించారు.

మల్టీజోన్-2లో టాప్ స్కోర్ 550 మార్కులు దక్కగా, మల్టీజోన్-1లో 532.5 మార్కులు టాప్ స్కోర్‌గా నమోదైంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ జాబితా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం విడుదల చేసింది. ఉగాది పండుగ సందర్భంగా అభ్యర్థులకు తీపి కబురు అందించేందుకు జనరల్ ర్యాంకింగ్‌ విడుదల చేసినట్టు కమిషన్‌ తెలిపింది.

తెలంగాణలో 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి 2024 ఫిబ్...