తెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 2 -- తెలంగాణలోని మాజీ వీఆర్వోలు, వీఆర్ఏలకు గ్రామ పంచాయతీ పాలనాధికారులుగా అవకాశం కల్పించనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవలనే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీని ద్వారా. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సేవలను పర్యవేక్షించేందుకు అధికారులు ఉండనున్నారు.

గ్రామ పంచాయతీ పాలనాధికారిగా నియమితులవ్వడానికి. ఇంటర్ తో పాటు ఐదేళ్ల పాటు వీఆర్వో లేదా వీఆర్ఏగా పని చేసి ఉండాలి. స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇక మిగిలిన పోస్టులకు డిగ్రీ అర్హత ఉన్న వారిని డైరెక్ట్ గా రిక్రూట్ చేయనుంది. అయితే తాజాగా ఇందుకు సంబంధించి మరో ప్రకటనను జారీ చేసింది. అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.

తెలంగాణకు చెందిన మాజీ వీఆర్వోలు, వీఆర్ఏ లు గ్రామ పాలనాధికారి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలని భూపరిపాలన ప్ర...