తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 2 -- రాష్ట్రంలో దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్వయం ఉపాధి కోసం ప్రవేశ పెట్టిన సబ్సిడీ రుణాల నిధులను మంజూరు చేసింది. అర్హతలు ఉన్న వారిని ఎంపిక చేసి వందశాతం సబ్సిడీతో ఈ రుణాలను అందించనుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోనూ అర్హులను గుర్తించనున్నారు.

ఈ రుణాల కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 12వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అర్హులైన వారు ఈలోపే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్ లైన్ ద్వారా స్వీకరించే దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆ తర్వాత మండల స్థాయిలో ఎంపీడీవోలు చెక్ చేస్తారు. 1:3 నిష్పత్తిలో దరఖాస్తులను ఎంపిక చేసి జిల్లా అధికారులకు జాబితా పంపుతారు. అడిషనల్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఫైనల్ లిస్ట్ ను రూపొందిస్తారు. ఈ జాబితానే ఆన్ లైన్ లో ఉంచుతారు.

Publish...