భారతదేశం, ఫిబ్రవరి 1 -- TG Govt Schools : తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ, మోడల్‌ స్కూళ్లలో స్పెషల్ క్లాసులకు హాజరయ్యే పదో విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందించాలని నిర్ణయించింది. నేటి నుంచి ఈ కార్యక్రమం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ అబిడ్స్‌లోని ప్రభుత్వ అలియా మోడల్ హై స్కూల్ లో పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్‌ను అందించారు.

పదో తరగతిలో పాస్ పర్సెంటేజ్ పెంచేందుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్పెషల్ క్లాస్ లు నిర్వహిస్తున్నారు. దసరా తర్వాత చాలా స్కూళ్లలో ప్రత్యేక తరగతులు ప్రారంభం అయ్యాయి. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఒంటి గంటకు పెడతారు. ప్రత్యేక తరగతులు పూర్తయి ఇంటికి వెళ్లేసరికి దాదాపుగా రాత్రి 7 గంటలు అవుతుంది. విద్యార్థులు అప్పటి వరకు ఏం తినకుండా ఆకలిత...