తెలంగాణ,హైదరాబాద్, జనవరి 26 -- ఇవాళ్టి నుంచే రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు స్కీమ్ లు లాంచనంగా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ప్రతి మండలంలోని ఒక గ్రామంలో ఈ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇవాళ 606 గ్రామాల్లో లాంఛనంగా ఈ నాలుగు స్కీంలకు శ్రీకారం చుట్టనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అమలు చేస్తారు. చంద్రవంచలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని. ఈ స్కీమ్ లను ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లను సిద్ధం చేసింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....