భారతదేశం, ఏప్రిల్ 4 -- ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని.. ఎంప్లాయీస్ జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి వివరించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ.. శుక్రవారం ఉదయం ప్రజా భవన్‌లో వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను లచ్చిరెడ్డి డిప్యూటీ సీఎంకు వివరించారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ తోపాటు.. రాష్ట్ర స్థాయిలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ అనివార్యతను వివరించారు. ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్, నాయకుల వినతిపై సానుకూలంగా స్పందించిన భట్టి.. సమస్యలను పరిష్కరిస్తామని, త్వరలోనే పెండింగ్ బిల్లులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

తెలంగ...