భారతదేశం, ఏప్రిల్ 14 -- తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపులో ఆలస్యం అవుతోంది. ఫలితంగా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు బ్యాంక్ ఈఎంఐలు కట్టడానికి ప్రైవేట్ ఫైనాన్సర్ల దగ్గర అధిక వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటున్నారు. గత పదేళ్లుగా జీతాలు రావడం చాలా ఆలస్యం అవుతోందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈనెల 13వ తేదీ దాటిపోయినా.. ఇంకా జీతం పడలేదని ఓ ఉద్యోగి 'హిందుస్తాన్ టైమ్స్ తెలుగు' ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ఇందుకు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1.తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఖర్చులకు సరిపోవడం లేదని, దీనివల్ల జీతాలు చెల్లించడంలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. ఇటు ఎన్నికల హామీలను నెరవేర్చడానికి, సంక్షేమ పథకాలకు నిధులు క...