భారతదేశం, ఏప్రిల్ 15 -- TG Govt Affidavit: వివాదాస్పదంగా మారిన హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీ భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనని స్పష్టం చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి సుప్రీ కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు.

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఆ భూమి ఆటవీ భూమి కాదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందించిన అఫిడవిట్‌లో స్పష్టంచేసింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో ఉన్న భూమి ఎప్పుడూ అటవీ రికార్డుల్లో లేదని వివరించింది.

ఏపీఐఐసీ ద్వారా వేలం వేసేందుకు హెచ్‌సీయూ సమీపంలో ఉన్న 400ఎకరాల భూమిని కొద్ది రోజుల క్రితం బుల్డోజర్లతో చదును చేయడం వివాదాస్పదంగా మారింది. 2004లో ఐఎంజీ ఇండ్‌ భారత్‌కు కేటాయించిన భూముల్ని 2006లో రద్దు చేశారు. ఆ తర్వాత కోర్టు వివాదాలు తలెత్తాయి. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర...