భారతదేశం, ఏప్రిల్ 1 -- సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించేందుకు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని.. కలెక్టర్లను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని, అందుకు తగిన విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.

ఇప్పటికే యాభై శాతానికి పైగా సన్నబియ్యం చౌక ధరల (రేషన్ షాప్) దుకాణాలకు వచ్చాయని.. సీఎస్ శాంతి కుమారి వివరించారు. మిగిలిన స్టాక్‌ను రెండు రోజుల్లో పంపిణీ చేస్తామని ఆమె తెలిపారు. బియ్యం నాణ్యత, పరిమాణానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా.. వెంటనే పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు.

తెలంగాణ ప్రభుత్వం పేదల ఆహార భద...