భారతదేశం, మార్చి 8 -- తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన కాంట్రాక్టర్లకు ఇచ్చే పనుల విలువను సవరిస్తూ.. బోర్డ్‌ ఆఫ్‌ చీఫ్‌ ఇంజినీర్స్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని జలసౌధలో పంచాయతీరాజ్, రోడ్లు-భవనాలు, మిషన్‌ భగీరథ, ప్రజారోగ్య శాఖలకు చెందిన సీఈలతో కూడిన బీవోసీ కమిటీ సమావేశం.. ఛైర్మన్‌ అనిల్‌కుమార్‌ అధ్యక్షతన జరిగింది. ఈ భేటీలో మొత్తం 11 అంశాలపై చర్చించారు.

ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్స్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ కింద ఇప్పటి వరకు వారికి ఇస్తున్న కాంట్రాక్టులను రూ.కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. అన్ని శాఖల ఇంజినీరింగ్‌ విభాగాల్లో విజిలెన్స్‌ విభాగాన్ని పటిష్ఠం చేయడంపై, హైడ్రాలిక్, ఎలక్ట్రిక్‌ మెకానికల్‌ కాంపోనెంట్ల పనులపై విధిస్తున్న పన్నులపై చర్చించారు. ప్రాజెక్టులకు సంబంధించిన పరీక్షలు, సర్వేలు, ఇన్వెస్టిగేషన్...