తెలంగాణ,హైదరాబాద్, జనవరి 22 -- పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని కోరారు. గ్రామ సభల నిర్వహణపై మంగళవారం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ. 4 నూతన పథకాల అమలు కోసం గ్రామసభలు ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొదటి రోజు 4938 గ్రామ/ వార్డు సభలు నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామసభలలో ప్రదర్శించిన పథకాల అర్హుల ప్రాథమిక జాబితాలో అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా స్వీకరించి విచారణ చేపట్టాలని ఆదేశించారు. అనర్హులుగా తేలితే జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేశారు.

గ్రామసభలలో పెట్టే ప్రాథమిక జాబితా మంజూరు పత్రం కాదని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. కేవలం దరఖాస్తుల స్వీక...