భారతదేశం, డిసెంబర్ 14 -- తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీస్‌లో ఖాళీగా ఉన్న 60 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు. డిసెంబర్ 15వ తేదీలోపు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా సైంటిఫిక్‌ ఆఫీసర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, ల్యాబోరేటరీ టెక్నీషియన్‌, ల్యాబోరేటరీ అటెండెంట్‌ పోస్టులను రిక్రూట్ చేస్తారు. మొత్తం 13 రకాల పోస్టులున్నాయి. పీజీ, డిగ్రీ, ఇంటర్ విద్యా అర్హతల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. 30 మార్కులకు రాత పరీక్ష, విద్యా అర్హతల్లో సాధించిన ఉత్తీర్ణతకు 70 శాతం మార్కులుంటాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.07.2025 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. సైంటిఫిక్ ఆఫీసర్‌, సైంటిఫిక్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.2,000 (ఎస్సీ/ఎస్టీ అభ్య...