తెలంగాణ,హైదరాబాద్, మార్చి 30 -- రాష్ట్రంలో పేదలందరికీ ప్రభుత్వం ఇకపై సన్నబియ్యం పంపిణీ చేయనుంది. ఈ పథకాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంగా లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా.. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అర్హులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తారు.

కార్డు లేకపోయినా జాబితాలో పేరు ఉంటే సన్నబియ్యం పొందవచ్చు. కొత్త జాబితాల ప్రకారం పేర్లు ఉన్నప్పటికీ వారికి ఇంకా కార్డులు రాలేదు. అయితే పేరు ఉంటే సన్నబియ్యం తీసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. త్వరలో ఉప్పు, పప్పు, చింతపండు వంటి సరుకులను కూడా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ సన్నబియ్యం పంపిణీ స్కీమ్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇక్కడ తెలుసుకోండి...

Published by HT Digital Con...