భారతదేశం, జనవరి 28 -- ఈ కాలం యువత రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలలు కంటోంది. అందుకోసం అక్రమ మార్గాలను ఎంచుకుంటోంది. వాటిల్లో ప్రధానమైంది దొంగనోట్ల దందా. దీంట్లో చిక్కుకొని ఇప్పటికే చాలామంది కటకటాలపాలయ్యారు. అయినా పరిస్థితి మారడం లేదు. తెలంగాణలో ఇటీవల చాలాచోట్ల ఈ దందా జోరుగా సాగుతోంది. తాజాగా.. వరంగల్ పోలీసులు ఓ ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి భారీగా నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ కరెన్సీని ముద్రించి, చలామణి చేస్తున్న ఎనిమిది మందిని కాకతీయ విశ్వవిద్యాలయ క్యాంపస్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ కరెన్సీ ముద్రణకు ఉపయోగించే కాగితంతో పాటు రూ.38.84 లక్షల నగదు, రూ.21 లక్షల విలువైన నకిలీ నోట్లు, ఒక కారు, తొమ్మిది మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

లక్ష రూపాయల నిజమైన కరెన్సీకి.. నాలుగు రెట్లు విలువైన నకిలీ నోట్లన...