తెలంగాణ,హైదరాబాద్, మార్చి 27 -- ఉపకార వేతనాలు, బోధన రుసుములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024- 2025 విద్యా సంవత్సరానికి గానూ స్కాలర్ షిప్స్ రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్ తేదీల గడువును మరోసారి పొడిగించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులు బోధన ఫీజులు, స్కాలర్ షిప్ కోసం మే 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. గత విద్యా సంవత్సరానికి సంబంధించి 11 లక్షలకు పైగా విద్యార్థులు ఉండగా. 10 లక్షలకు పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొన్ని కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ జాప్యం కావటంతో. కొంతమంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. దీంతో ప్రభుత్వం. గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

నిజానికి ఈ గడువు గతేడాది డిసెంబర్ 31వ తేదీతోనే పూర్తి అయిం...