భారతదేశం, ఫిబ్రవరి 7 -- తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఫిబ్రవరి 6వ తేదీన ఒక్కరోజే 15 వేల 752 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది మార్చి 8న 15 వేల 623 మెగావాట్లు వినియోగించగా.. ఈసారి ఫిబ్రవరిలోనే రికార్డు స్థాయిలో వినియోగం పెరిగింది. ఈ స్థాయిలో విద్యుత్ వినియోగం ఎందుకు పెరుగుతోంది..? దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ప్రధానమైంది. వ్యవసాయానికి నీటి పారుదల సౌకర్యం కోసం విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. రైతులు పంటలకు నీరు పెట్టడానికి ఎక్కువగా విద్యుత్ మోటార్లు ఉపయోగిస్తున్నారు.

తెలంగాణలో పరిశ్రమల సంఖ్య పెరుగుతోంది. కొత్త పరిశ్రమలు స్థాపించడం, ఉన్న పరిశ్రమలు విస్తరించడం వల్ల విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతోంది.

హైదరాబాద్ వంటి పెద్ద నగర...