భారతదేశం, జనవరి 26 -- కరెంట్ సరఫరాకు ఆటంకం కలిగినప్పుడు పునరుద్ధరణ సేవలను వేగవంతం చేసేందుకు.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక వాహనాలను కేటాయించి.. పునరుద్ధరణ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు జిల్లాలకు కూడా కేటాయిస్తున్నారు. తాజాగా.. సంగారెడ్డి జిల్లాకు రెండు వాహనాలను కేటాయించారు. వీటిల్లో సిబ్బంది తోపాటు సామగ్రిని తరలించి కరెంట్ సరఫరాను పునరుద్ధరిస్తారు.

విద్యుత్ వినియోగదారులకు తక్షణ సేవలే లక్ష్యంగా 108 అంబులెన్సుల తరహాలో.. విద్యుత్తు శాఖ 1912 టోల్‌ ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నంబరుకు ఫోన్‌ చేయగానే.. ఈ వాహనాల్లో సిబ్బంది వచ్చి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా ఎండాకాలంలో తరచూ విద్యుత్తు సమస్యలు తలెత్తుతుంటాయి. వినియోగదారులు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినా.....