తెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 4 -- తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్య‌వ‌స్థ రూప‌క‌ల్ప‌న‌కు స‌మ‌గ్ర విధానప‌త్రం రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. విద్యా క‌మిష‌న్‌ను ఆదేశించారు. ఉత్త‌మ విద్యా వ్య‌వ‌స్థ ఏర్పాటుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వం వెనుకాడ‌బోదని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయి ప‌రిస్థితుల‌కు అద్దంప‌ట్టేలా, ఆచరణ యోగ్యంగా విధాన‌ ప‌త్రం ఉండాల‌ని చెప్పారు.

ప్ర‌స్తుత విద్యా వ్య‌వ‌స్థ‌లో లోపాలు, తీసుకురావ‌ల్సిన సంస్క‌ర‌ణ‌ల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఐసీసీసీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. విద్యా రంగానికి త‌మ ప్ర‌భుత్వం ఇస్తున్న ప్రాధాన్య‌త‌, ఉపాధ్యాయుల నియామ‌కం, అమ్మ ఆద‌ర్శ క‌మిటీలు, పుస్త‌కాలు, యూనిఫాంల పంపిణీతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ (YISU) నిర్మా...