భారతదేశం, ఏప్రిల్ 8 -- భవిష్యత్తులో ముందడుగు వేయాలంటే.. పదో తరగతి అత్యంత కీలకం. పదిలో ఉత్తీర్ణత సాధిస్తేనే ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల తెలంగాణలో వార్షిక పరీక్షలు ముగిశాయి. ఇక ఇప్పుడు ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది, ప్రవేశపరీక్షలు ఏముంటాయి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయనే సందేహాలు విద్యార్థుల్లో ఉంటాయి. చదువు, ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఇలా ఉంది.

రెండేళ్ల వ్యవధితో ఇంటర్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ).. ఇందులో ఉత్తీర్ణులైతే బీటెక్, బీఆర్క్‌ (జేఈఈ/ఎప్‌సెట్‌ రాయవచ్చు). బీఎస్సీలో పలు కోర్సులు చేయవచ్చు. బైపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ).. నీట్‌ రాసి మెడిసిన్, బీడీఎస్, ఫార్మాడీ, బి.ఫార్మసీ, వ్యవసాయ, ఉద్యాన కోర్సులతో పాటు డిగ్రీ - బీఎస్సీలో చేరవచ్చు. ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్...