భారతదేశం, ఫిబ్రవరి 14 -- విద్యాశాఖ ఉన్నతాధికారులతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు సంబంధించి.. అవసరమైన స్థలాల సేకరణ, ఇతర పనుల పురోగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

నియోజకవర్గాల్లో స్థలాల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన చోట.. అనుమతులు, ఇతర పనులను వేగంగా చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో ముందుగా పరిశీలించాలని సూచించారు. అనువైన స్థలం లేని చోట ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని.. త్వరగా స్థలాలను గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాల...