తెలంగాణ,హైదరాబాద్, మార్చి 12 -- తెలంగాణలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు నిర్ణయించిన ఫీజును చెల్లించి. అప్లికేషన్ చేసుకోవచ్చు. జూన్ 1వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది.

టీజీ ఎడ్ సెట్ ద్వారా 2025 - 2026 విద్యా సంవత్సరానికి గాను బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మే 13వ తేదీతో ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది. రూ. 500 ఫైన్ తో మే 24 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు రూ. 750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 550 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

జూన్ 1వ తేదీన ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుంది. ఉదయం సెషన్ ఉదయం 10 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం సెష...