భారతదేశం, జనవరి 30 -- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎడ్ సెట్ - 2026 షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా 2026-27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు.

ఉన్నత విద్యామండలి తెలిపిన వివరాల ప్రకారం. ఫిబ్రవరి 20వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

టీజీ ఎడ్ సెట్ - 2026 పరీక్షను మే 12వ తేదీన నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పూర్తి చేస్తారు. మొదటి సెషన్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్‌ నిర్వహిస్తారు.

ఈసారి కూడా ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్షను కాకతీయ యూనివర్శిటీ నిర్వహించనుంది. ఎంట్రెన్స్ పరీక్షలో అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రిజర్వేషన్ల...