తెలంగాణ,హైదరాబాద్, మార్చి 8 -- తెలంగాణలో ఈసెట్ - 2025 నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు బీఎస్సీ మ్యాథ్స్‌ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈసెట్‌ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. ఈ ఎంట్రెన్స్ ద్వారా బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను కల్పిస్తారు.

ఉన్నత విద్యామండలి తరపున ఈ ఏడాది ఉస్మానియా యూనివర్శిటీ పరీక్ష బాధ్యతలను చూడనుంది. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 19వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా చెల్లించవచ్చు. రిజిస్ట్రేషన్‌ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర విభాగాల అభ్యర్థులు రూ.900 చెల్లించాలి. రూ. 500 ఆపరాద రుసంతో ఏప్రిల్ 26 వరకు, రూ. 1000 ఆపరాద ...