భారతదేశం, ఫిబ్రవరి 25 -- TG Ecet 2025: తెలంగాణలో ఈసెట్ 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి తరపున ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు బిఎస్సీ మ్యాథ్స్‌ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈసెట్‌ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈసెట్‌ 2025 నోటిఫికేషన్‌లో అభ్యర్థుల నుంచి ఉస్మానియా యూనివర్శిటీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. దీని కోసం అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈసెట్ 2025 ద్వారా బిఇ, బిటెక్‌, బిఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరంలో తెలంగాణ విద్యా సంస్థల్లో ప్రవేశాలను కల్పిస్తారు.

తెలంగాణ ఈసెట్‌ ప్రవేశపరీక్షను ఆన్‌లైన్‌లో మాత్రమే నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ దరఖాస్తుల్ని మార్చి 3 నుంచి ఏప్రిల్ 19వ తేదీ మధ్య ఎలాంటి ఆలస్య రుసు...