తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 6 -- ఇంజినీరింగ్,అగ్రికల్చర్‌ ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 4వ తేదీతో ఎలాంటి ఫైన్ లేకుండా అప్లికేషన్ల గడువు ముగిసింది. శుక్రవారం నాటికి మొత్తం 2,91,965 దరఖాస్తులు రాగా... ఇంజినీరింగ్‌కు 2,10,567, అగ్రికల్చర్‌- ఫార్మసీకి 81,172 వచ్చాయి. ప్రస్తుతం రూ. 250 ఫైన్ తో అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు కూడా ఏప్రిల్ 9వ తేదీతో పూర్తవుతుంది.

రూ.5 వేలతో ఏప్రిల్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. ఏప్రిల్ 14 వరకు రూ. 500 ఆల‌స్య రుసుము నిర్ణయించారు. ఇక ఏప్రిల్ 18 వరకు రూ. 2500 ఫైన్, ఏప్రిల్ 24 వరకు రూ. 5 వేల ఆల‌స్య రుసుము చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. కొత్తగా ఎడిట్ ఆప...