Telangana, మే 11 -- ఉదయం 11 గంటలకు తెలంగాణ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు విడుదలవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఈ ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. https://eapcet.tgche.ac.in/ లింక్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవాలి.

గతేడాది(2024) ఫలితాలను చూస్తే.. ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో ఉత్తీర్ణత శాతం 74.98గా ఉంది.ఇందులోనూ అబ్బాయిలు 74.38 శాతం,అమ్మాయిలు 75.85 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ లో చూస్తే అబ్బాయిలు 88.25 శాతం, అమ్మాయిలు 90.18 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 89.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

గతేడాదితో పోల్చితే ఈసారి కాస్త ముందుగానే ఫలితాలను విడుదల చేస్తున్నారు.కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా త్వరగా ప్రకటించి...సీట్ల భర్తీ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస...