తెలంగాణ,హైదరాబాద్, మార్చి 5 -- తెలంగాణ ఈఏపీసెట్‌ పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు ఎలాంటి ఫైన్ లేకుండా కొనసాగుతుంది. ఏప్రిల్ 24 వరకు రూ. 5 వేల ఆల‌స్య రుసుము చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే... అభ్యర్థులకు అధికారులు అలర్ట్ ఇచ్చారు. ఉచితంగా మాక్ టెస్టులు రాసుకునే అవకాశం కల్పించారు.

గతేడాదితో పోల్చితే.ఈసారి కూడా ఇంజినీరింగ్ కోర్సులకు తెగ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అయితే మంచి కాలేజీ అనేది చాలా ముఖ్యం. టాప్ కాలేజీలో సీటు రావాలంటే.. ఎంట్రెన్స్ టెస్ట్ లో మంచి ర్యాంక్ సాధించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే అభ్యర్థులు సన్నద్ధమయ్యే పనిలో ఉన్నప్పటికీ... పరీక్షా విధానం, ప్రశ్నాల సరళి, సమయాభావంతో పాటు మరిన్ని విషయా...