భారతదేశం, డిసెంబర్ 13 -- రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్‌ - 2026 ప్రవేశ నోటిఫికేషన్ పై కసరత్తు కొనసాగుతోంది. త్వరలోనే షెడ్యూల్ ఖరారు చేసేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది. ప్రాథమికంగా పరీక్ష తేదీలను కూడా ఖరారు చేసినట్లు సమాచారం.

టీజీ ఈఏపీసెట్ - 2026 పరీక్షను మే మొదటి వారంలో నిర్వహించే యోచనలో ఉన్నత విద్యామండలి ఉంది. మే 4, 5 తేదీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షెడ్యూల్ పై కసరత్తు పూర్తి కాగా.. ప్రభుత్వానికి కూడా సమర్పించింది. ఇందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే. అధికారికంగా షెడ్యూల్ విడుదలవుతుంది.

ఈసారి కూడా జేఎన్టీయూనే ఎంట్రెన్స్ బాధ్యతలను చూసే అవకాశం ఉంది. ఎప్‌సెట్‌ షెడ్యూల్ వచ్చే వారం లేదా మరో వారంలో ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇంటర్, జేఈఈ పరీక్షల దృష్ట్యా.మే మొదటి వారంలో ఈఏపీ...