తెలంగాణ,హైదరాబాద్, మార్చి 1 -- ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్ - 2025కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. గత నెల 25 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సినప్పటికీ. స్థానికత విషయంలో సందిగ్ధత ఉండటంతో అధికారులు వాయిదా వేశారు.

ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం స్థానికతపై సవరణ మార్గదర్శకాలను జారీ చేసింది. 85 శాతం సీట్లను స్థానిక విద్యార్థులకే దక్కుతాయని స్పష్టం చేసింది. దీంతో ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలోనే. అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటల తర్వాత నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

Published by HT Digital Content Services with permission ...