భారతదేశం, మార్చి 31 -- ఎంసెట్‌ 2025 నోటిఫికేషన్‌‌ను ఫిబ్రవరి 20వ తేదీన జేఎన్‌టీయూ హైదరాబాద్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కావాలి. కానీ అనూహ్యంగా వాయిదా పడింది. మార్చి 1వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. త్వరలో ఈ గడువు ముగుస్తుంది. విద్యార్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఏప్రిల్‌ 29 నుంచి మే 5వ వరకు పరీక్షలు జరుగనున్నాయి. అధికారిక వెబ్‌సైట్‌ https://eapcet.tgche.ac.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 లేట్ ఫీజుతో ఏప్రిల్ 9వ తేదీ వరకు, రూ.500 లేట్ ఫీజుతో.. ఏప్రిల్ 14 వరకు, రూ.2500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 వరకు, రూ.5 వేలు లేట్ ఫీజుతో ఏప్రిల్ 24వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులో...