భారతదేశం, మార్చి 17 -- మాదకద్రవ్యాల వినియోగం.. ఎన్నో కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. మాదకద్రవ్యాల వినియోగం వల్ల నేరాలు పెరుగుతున్నాయి. యువత నేరాలకు పాల్పడటానికి ఇది ఒక ప్రధాన కారణం అని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన 9 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.తెలంగాణ నుంచి మాదకద్రవ్యాల మహమ్మారిని పారదోలేందుకు.. కఠిన చర్యలు తీసుకుంటున్నామని.. వాటిని అమ్మేవారి ఇళ్లకు తాగునీరు, విద్యుత్తు కనెక్షన్లు తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు.

2.ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో ఆ దిశగా అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికి సంబంధించి చట్ట సవరణకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్‌ సరఫరాదారుల...