తెలంగాణ,హైదరాబాద్, జనవరి 29 -- ప్ర‌తిక్ష‌ణం ప్ర‌జ‌ల‌కు స‌మాచారాన్ని చేర‌వేస్తున్న ఆన్‌ లైన్ న్యూస్ మీడియా(వెబ్‌సైట్‌, యాప్‌)కు ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వాలని తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్ హరీష్‌కు విజ్ఞప్తి లేఖను అందజేశారు. ఆన్‌లైన్ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరాన్ని తెలుపుతూ పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై ఐ అండ్ పీఆర్ (IPR Department) కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు TDMJA (Telangana Digital Media Journalist Association) ప్రతినిధులు చెప్పారు. త్వరలోనే ఆన్‌లైన్ మీడియా(వెబ్‌సైట్‌, యాప్‌)కు ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చే ప్రక్రియ షురూ చేస్తామని హామీ ఇచ్చారని వివరించారు.ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందిస్తామని చెప్పార...